కలబంద వల్ల కలిగే అందం మరియు ఆరోగ్య ప్రయోజనాలు!

పల్లెటూర్లలో పలు ప్రాంతాల్లో పొలాల గట్ల పైన రాళ్లు రప్పల మధ్య అధికంగా పెరిగే మొక్క ఇది. దీనిని మనం మన ఆరోగ్యానికే కాకుండా అందాన్ని కూడా వాడుతూ ఉంటాం. దాని పేరు కలబంద. ఈ కలబంద మొక్కను మన గుమ్మానికి వేలాడదీయడం కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. కలబందను ఆంగ్లంలో అని అంటారు.


కలబంద వల్ల కలిగే అందం మరియు ఆరోగ్య ప్రయోజనాలు!

కలబంద యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇది బహుళ ప్రయోజనాలను కలిగి ఉంది. కలబంద ఆకుల రసంలో లో కొంచెం కొబ్బరి నూనె వేసి మోచేతులు మోకాళ్లకు మన శరీరంలో ఎక్కడైనా నల్లగా ఉన్న ప్రదేశాల్లో రాసుకోవాలి. అలా రాసుకున్న కొద్దిసేపటి తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల నల్లని మచ్చలు పోతాయి.


కలబంద గుజ్జును తీసి మనకు ఎక్కడైనా కాలిన చోట రాస్తే త్వరగా గాయం నయం అవ్వడమే కాకుండా మచ్చ కూడా పూర్తిగా పోతుంది. అలాగే కలబందను తీసుకొని దాని నుండి రసాన్ని తీసి రోజ్ వాటర్ తో కలిపి ముఖానికి రాస్తే పొడిబారిన చర్మం కళకళలాడుతోంది.


ఇలా తీసిన కలబంద రసంలో ముల్తాన్ మట్టి చందనం పొడిని కలిపి మిశ్రమం లాగా చేసుకుని ముఖానికి రాసుకుంటే ముఖం మీద ఉన్న మొటిమలు మాయమవుతాయి. అలాగే ఈ కలబంద రసం తో మనకు పొంగు వచ్చినపుడు వచ్చిన మచ్చలు పోనీ వారికి ఈ మచ్చలపైన కలబంద రసం తో రాస్తే మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి.


మీకు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఉన్నా మా వెబ్ సైట్ ని దర్శిస్తూ ఉండండి. అలాగే కే మీకు ఎలాంటి సందేహం ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు. మీరు గనక వాడినట్లయితే మీ యొక్క అనుభవం కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి.

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.