రోజు కొబ్బరినూనె తాగటం వలన కలిగే ప్రయోజనాలు!

నేడు అందరి నోటా వినిపిస్తున్న మాట కొబ్బరి నూనె వాడకం .కొబ్బరి నూనె వాడకం వలన అధిక బరువు, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మరియు మధుమేహంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. అయితే ఇందులో నిజమెంత ఈ కొబ్బరినూనెను ఎలా వాడితే మంచి ప్రయోజనం పొందవచ్చు ఇప్పుడు చూద్దాం .తాజా అధ్యయనంలో వెల్లడైన విషయం ఏమిటంటే కొబ్బరి నూనె వలన మనకు అనేక ఆరోగ్య ఫలితాలు కలుగుతాయని వెల్లడయింది. కొబ్బరి నూనెను తీసుకోవడం వలన మంచి ఫలితాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు . అయితే ఈ కొబ్బరి నూనె వాడకం మరియు తీసుకునే మోతాదు విషయంలో ఆరోగ్య నిపుణుల సలహా తప్పనిసరి.


మీరు 40 నుండి 60 కేజీల బరువుతో ఉన్నారా అయితే మీరు మూడు స్పూన్ల కొబ్బరి నూనెను ఒక రోజులో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మూడు స్పూన్ల కొబ్బరినూనె ఒకేసారిగా కాకుండా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ,ఆహారం తీసుకునే ఒక అరగంట ముందు తీసుకోవాలి .


అలాగే మీరు 61 నుండి 80 కేజీల బరువు తో ఉంటే రోజులో నాలుగునర్ర స్పూన్ల చొప్పున మూడు పూటలా తీసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, పూట లో ఆహారం తీసుకునే ఒక అరగంట ముందు తీసుకోవాలి.


అలాగే మీ బరువు 81 కేజీలు కన్నా ఎక్కువ ఉంటే ఆరు స్పూన్ల కొబ్బరినూనెను తీసుకోవలసి ఉంటుంది. దీనిని పూటకు రెండు టీస్పూన్ల చొప్పున మూడుపూటలా తీసుకోవాలి. మనం తలకు రాసుకునే కొబ్బరి నూనె కాకుండా ఎటువంటి రసాయనాలు కలపని సహజ వంతమైన కొబ్బరి నూనెను మాత్రమే వాడాలి .


అయితే మీకు కొత్త లో కొబ్బరి నూనె తీసుకోవడం వలన వాంతులు మరియు విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్య ఎక్కువ రోజులు కనిపిస్తే మీరు ఈ కొబ్బరి నూనెను తీసుకోవడం ఆపేయండి. లేదా కొబ్బరి నూనెతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.


కొబ్బరి నూనె శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును శాతాన్ని కరిగించడానికి బాగా సహాయపడుతుంది .


కొబ్బరి నూనె వాడకం చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది. చర్మంపై ఏర్పడే నల్లటి మచ్చలు మొటిమల సమస్యలను దూరం చేసి కాంతివంతమైన చర్మాన్ని తిరిగి ప్రసాదిస్తుంది. అలాగే వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడుతుంది.


రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. శరీరంలోని రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడతాయి .


జీర్ణక్రియలు సాఫీగా జరిగేలా చేయటంతోపాటు జీర్ణాశయాన్ని మరియు ప్రేగులను శుభ్రపరిచి ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలసట మరియు ఒత్తిడి వంటి సమస్యలను నివారిస్తుంది.

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.