మట్టి కుండలో నీరు త్రాగడం వలన కలిగే ప్రయోజనాలు!

మట్టికుండను పేదవాడి ఫ్రిజ్ గా పిలుస్తారు. మట్టికుండలో నిలువ చేసిన నీరు అమృత ప్రాయం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రకృతి నుండి సహజంగా లభించిన మట్టితో కుండలు తయారు చేస్తారు. మనం ఉపయోగించే ప్లాస్టిక్ లేదా గాజు వాటితో పోలిస్తే మట్టి కుండలో నీరు చాలా శ్రేష్టమైనది.


మట్టి కుండలో నీరు త్రాగడం వలన కలిగే ప్రయోజనాలు!

ఒక వేసవి కాలంలోనే కాకుండా సంవత్సరం పొడవునా తీసుకోవచ్చు. ఇందులో నిల్వ చేయబడిన నీరు బయటి వాతావరణం శీతోష్ణ స్థితులను బట్టి చల్లగా మారుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఉపయోగించే సాంకేతిక పరికరాల్లో కూడా ఇటువంటి టెక్నాలజీ కనిపించదు.


మట్టి కుండ ఒక ప్యూరిఫైర్ లాగా పనిచేస్తుంది. ఇది నీటిలో ఉండే మలినాలను బ్యాక్టీరియా మరియు ఫంగస్ వంటి వాటిని సహజసిద్ధంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని శుద్ధమైన మంచినీటిని మనకు అందిస్తుంది. మట్టి కుండలో నీరు మన శరీర రోజువారీ కార్యకలాపాలు జీవక్రియ రేటును పెంచడానికి సహాయపడుతుంది. శరీరంలో మెటబాలిజం రేటును పెంచి తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేలా చేసి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.


ఆల్కలీన్ స్వభావం నీటి ఆమ్లత్వం పై బాగా పనిచేస్తుంది. అందువల్ల శరీరంలో అవసరమైన పీహెచ్ లెవల్స్ ను సమతుల్యం చేస్తుంది . శరీరంలో ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది. ఉదర సంబంధిత వ్యాధులను తగ్గించడంతో పాటు అజీర్తి మరియు ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది.


అంతేకాకుండా మట్టి కుండ లో నిల్వ చేయబడిన నీరు చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా నిల్వ చేయబడిన నీరు మరింతగా మలినాలను బ్యాక్టీరియాను శుద్ధి చేసి మనకు ఆరోగ్యవంతమైన నీటిని అందిస్తుంది.


మట్టి కుండలోని నీరు మన దాహార్తిని తీర్చడమే కాకుండా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది . మట్టికుండలోని నీరు మన శరీరంలో వెంటనే శోషించబడుతుంది . ఇన్ని ప్రయోజనాలున్న మట్టి కుండ నీటినే తీసుకుందాం ఆరోగ్యంతో జీవితాన్ని గడుపుదాం !

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.