కొబ్బరి శక్తిని తగ్గనివ్వదు! వయస్సుని పెరగనివ్వదు!

Updated: Nov 3, 2019

కొబ్బరిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలాగే నెయ్యిలో ఉన్నట్లుగా దేనిలోనూ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ సాధారణంగా శాచ్యురేటెడ్ చేసినంత హాని కొబ్బరిలో కొవ్వులు ఏ మాత్రం చేయవు.


కొబ్బరి శక్తిని తగ్గనివ్వదు! వయస్సుని పెరగనివ్వదు!

కొబ్బరిలో మనకు కావాల్సిన 61% డైటరీ ఫైబర్ ఉంటుంది. అది శరీరంలోకి చక్కెరను చాలా నెమ్మదిగా విడుదల చేస్తుంది. కాబట్టి కొబ్బరి డయాబెటిస్ నుంచి దూరంగా ఉంచుతుంది. అలాగే డయాబెటిస్ రాకుండా చేస్తుందని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. పైగా చక్కెరను, తీయదనాన్ని ఆస్వాదించాలనే భావనను కొబ్బరి తగ్గిస్తుంది. కొబ్బరి తినడం వల్ల తీపి తినాలనే కోరిక తగ్గుతుంది. కాబట్టి డయాబెటిస్ ను రాకుండా చాలావరకు ఆపుతుంది.


కొబ్బరిలో సైటోకైనిన్స్, కైనెటిన్, ట్రాన్స్ జీటిన్ అనే అంశాలు మన వయసును తగ్గిస్తాయి. అంటే మనం యవ్వనంగా ఉండేలాగా చూస్తుంది. అలా ఉండాలంటే కొబ్బరి తింటే చాలా మంచిది.


కొబ్బరిలో వ్యాధి నిరోధక శక్తి తట్టుకునే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి తినేవారిలో వైరల్, ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి పెరుగుతుంది. కొబ్బరి నూనె ఎక్కువగా వాడే వారికి గొంతు ఇన్ఫెక్షన్, బ్రాంకైటిస్, యూరినరీ, ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు దరిచేరనివ్వదు.

కొబ్బరి తినటం వల్ల కొబ్బరి లో ఉండే కొవ్వు మనకి ఆకలి మందగించేలాగా చేస్తుంది. అందుకే బరువు తగ్గాలి అనుకునే వారు కొబ్బరి తినటం అనేది అలవాటు చేసుకుంటే మంచిది. ఇది ఒక ఆరోగ్యవంతమైన మార్గం.

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.