మధుమేహం తగ్గించుకుందాం రండి!

Updated: Nov 3, 2019

ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి మధుమేహం ఈ మధుమేహానికి చాలామంది బలవుతున్నారు. పిల్లలు, పెద్దలు, యువకులు, ఆడవాళ్లు అని ఎటువంటి తేడా లేకుండా అందరూ ఈ మధుమేహ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ మధుమేహం వ్యాధికి డాక్టర్లు శాశ్వతమైన పరిష్కారాన్ని చూపలేక ఉపశమనానికి టాబ్లెట్లు ఇంజక్షన్ రూపంలో లో మనకి వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఆయుర్వేదం లో మధుమేహానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మధుమేహాన్ని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. మనకు తెలిసిన అత్యంత సులువైన మార్గం ఒకటి మీకు చెప్తున్నాను.


మధుమేహం తగ్గించుకుందాం రండి!

కావలసిన పదార్థాలు:

కృష్ణ తులసి ఆకుల పొడి, అశ్వగంధ దుంపలపొడి , మెంతుల పొడి.


ఉపయోగించు విధానం:

కృష్ణ తులసి ఆకుల పొడి, అస్వగంద దుంపల పొడిని అలాగే మెంతుల పొడిని ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకొని కలిపి నిల్వ ఉంచుకోవాలి. ఒక గాజు సీసాలో ఉంచుకుంటే మంచిది. ఈ చూర్ణాన్ని మనం రెండు పూటలా ఆహారానికి అరగంట ముందు తీసుకోవాలి. అనగా మధ్యాహ్నం, రాత్రికి భోజనానికి 30 నిమిషాలు ముందు అరచెంచా మోతాదులో క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మధుమేహం అనేది ఇది క్రమంగా అదుపులోకి వస్తుంది అలాగే క్రమంగా మధుమేహం అనేది తగ్గుతుంది మనిషి శరీరంలో లో ఉన్న జీవకళ తిరిగి వస్తుంది.


డయాబెటిస్ వల్ల కొంతమందికి నపుంసకత్వం వస్తుంది. ఈ మందులు వాడటం వలన నపుంసకత్వం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. కావున ఈ మందులు తప్పకుండా అవసరం అయిన వారు ఉపయోగించండి. అద్భుత ఫలితాలు మీ శరీరానికి కలుగుతాయి. మీకు ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే లాగిన్ అయ్యి కామెంట్ బాక్స్ లో అడగవచ్చు. మీకు అవసరమైన పరిష్కారాలు ఇవ్వటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం.

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.