చిటికెలో జలుబు మాయం ఎలా?

Updated: Nov 3, 2019

వాతావరణం మారినప్పుడు వర్షంలో తడిసిన అప్పుడు అలాగే వేడి చేసినప్పుడు సాధారణంగా మనకు జలుబు చేస్తుంది. ప్రస్తుత వాతావరణం పూర్తిగా కలుషితమమైంది. కావున అందరికీ శ్వాసకోస వ్యాధులు సర్వసాధారణమైపోయాయి. ఈ కలుషితమైన వాతావరణంలో ఒక రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. జలుబు ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు ఒక చిన్న సులువైన మార్గం చూద్దాం.


చిటికెలో జలుబు మాయం ఎలా?

పరిష్కార మార్గం:

కావలసిన పదార్థాలు:

వాము 10 గ్రాములు, బెల్లం 40 గ్రాములు, మంచి నీళ్లు


ఉపయోగించు విధానం:

వాము, బెల్లం రోటిలో దంచుకొని మెత్తని ముద్దగా తయారుచేసుకోవాలి. వాము, బెల్లం తో తయారు చేసిన మెత్తటి ముద్దను అర లీటరు నీటిలో కలుపుకొని పొయ్యి మీద పెట్టి కాషాయం లాగా మరగబెట్టాలి. అర లీటరు నీళ్లు పావు లీటర్ అయ్యే వరకు బాగా మరిగించాలి. అలా మరిగిన నీటిని వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ వడపోసిన నీళ్లు గోరువెచ్చగా అయ్యేదాకా ఉంచి తర్వాత తాగాలి.


కొంతమందికి వేడి శరీరం ఉంటుంది. కనుక వాళ్లు ఈ కషాయాన్ని చల్లారిన తర్వాత తాగితే మంచిది. ఈ కషాయం తాగిన వెంటనే దుప్పటి కప్పుకొని పడుకోవాలి. అంటే ఈ కషాయం నిద్రపోయే ముందు తాగాలి. ఈ విధంగా రెండు లేదా మూడు రోజులు చేస్తే ఎంత తీవ్రమైన జలుబు అయినా సరే ఇట్టే తగ్గిపోతుంది.


మన వంటిలో రోగ నిరోధక శక్తి ప్రస్తుత వాతావరణం వల్ల క్షీణిస్తుంది. అందువల్ల సాధ్యమైనంత ఎక్కువగా మొక్కలను పెంచడానికి ప్రయత్నించండి. దాదాపు వేప చెట్టును పెంచడానికి ప్రయత్నం చేయండి. ఒక మనిషి సంవత్సరానికి పీల్చుకుని ఆక్సిజన్ యొక్క ఖరీదు దాదాపు ఏడు లక్షల నుండి పది లక్షల దాకా ఉంటుంది. మీకు ఎటువంటి సందేహాలు సమస్యలు ఉంటె మమ్మల్ని సంప్రదించండి. కామెంట్ బాక్స్ లో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయగలరు.

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.