కంటిచూపు వేగంగా పెరగడానికి చిట్కా

Updated: Nov 3, 2019


ప్రస్తుత కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కళ్ళజోడు వాడుతున్నారు. సమస్య ఏమిటి అంటే దృష్టిలోపం లేదా దృష్టి సమస్యలు. దీని కోసం అనేక రకాల కళ్ళజోళ్ళు, మందులు వాడుతూ వస్తున్నారు. మనం కంటి సమస్యలకు ఆయుర్వేద పద్ధతిలో మంచి పరిష్కార మార్గాన్ని మీ ముందుకు తీసుకు వచ్చాము.


కంటిచూపు వేగంగా పెరగడానికి చిట్కా

పరిష్కార మార్గం:

కావలసిన పదార్థాలు:
తయారుచేయు విధానం:

బాదంపప్పు కంటి యొక్క దృష్టిని పెంచడంలో సహాయపడుతుంది. బాదంపప్పు పావు కేజీ ఒక రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఉదయం పూట బాదంపప్పు పై ఉన్న తోలు తీసి నలగ్గొట్టాలి. దానిని ఎండలో ఉంచి ఎండబెట్టిన తరువాత దంచి పొడి చేసుకొని ఉంచుకోవాలి. సోంపు పావు కేజీ తీసుకొని దోరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత దానిని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పావు కేజీ బెల్లం తో బాదంపప్పు పొడి, సోంపు పొడి కలిపి ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి.

ఉపయోగించు విధానం:

పైన తయారు చేసిన పొడిని ఒక చెంచా తీసుకొని పాలల్లో కలుపుకొని త్రాగాలి. దీనివల్ల కృశించిన నరాలు తిరిగి శక్తివంతం అవుతాయి. ఈ పొడిని ఇలా ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా వాడాలి. దీని వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.