చిటికలో బరువు తగ్గటం ఎలా?

బరువు తగ్గడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతం చాలామందికి బరువు అనేది ఒక సమస్యగా మారిపోయింది. ప్రతి ఒక్కరికి పొట్ట రావడం లేదా ఒళ్ళు రావడం వల్ల చాలామంది వాళ్ల జీవితాన్ని ఆనందించ లేకపోతున్నారు. అందుకని జిమ్ కి వెళ్లి ఎక్సర్సైజులు చేయడం లేదా హాస్పిటల్ కి వెళ్లడం లేదా రకరకాల డైట్ ను పాటించడం ఏం చేస్తున్నారు ఇలా చేయడం వల్ల వాళ్ళ యొక్క శరీర బరువు తగ్గటం అనేది జరుగుతుంది కానీ చాలామందికి పైవి ఏవి చేయడం కుదరడం లేదు. అత్యంత సులభమైన సులువైన పరిష్కారం చూద్దాం.


చిటికలో బరువు తగ్గటం ఎలా?

కావలసిన పదార్థాలు: పుదినా, నిమ్మకాయలు, ఉప్పు, జీలకర్ర, మిరియాలు, మంచి నీళ్ళు ఒక గ్లాసు


తయారుచేయు విధానం: ముందుగా పుదీనా ఆకులను మిక్సీలో వేసుకొని మెత్తగా జ్యూస్ లాగా చేసుకుని పుదీనా రసాన్ని తీసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ నుండి నిమ్మరసం తీసుకోవాలి. జీలకర్ర ని తీసుకొని పొయ్యిమీద దోరగా వేయించుకోవాలి. అలా దోరగా వేయించిన జీలకర్రను మెత్తగా పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పొడి లాగా చేసుకున్న జీలకర్ర పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే మిరియాలు తీసుకొని మెత్తగా పొడి లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి


ఒక గ్లాసు మంచి నీళ్ళు తీసుకొని, దానిలో ఒక స్పూను నిమ్మరసం కలుపుకోవాలి. రెండు స్పూన్ల పుదీనా రసం కూడా కలుపుకోవాలి. మెత్తగా నూరి పెట్టుకున్న మిరియాల పొడిని ఒక అరచెంచా స్పూన్ కలుపుకోవాలి. ముందుగానే వేయించి దంచి పొడి చేసుకున్న జీలకర్రపొడిని ఒక అరచెంచా స్పూన్ కలుపుకోవాలి. ఉప్పు తగినంతగా వేసుకోవాలి లేదా చిటికెడు వేసుకోవాలి. వీటన్నిటినీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన మిశ్రమం తయారయింది.


ఉపయోగించు విధానం: ఈ మిశ్రమాన్ని మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు చొప్పున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు బరువు తగ్గటమే కాకుండా మీకున్న అనారోగ్య సమస్యలు క్రమేపీ తగ్గిపోతాయి ఇది అత్యద్భుతమైన అత్యంత సులువైన చక్కని పరిష్కారం.


ప్రస్తుత కాలంలో చాలామంది ఈ బరువు సమస్యతో బాధపడటం అనేది జరుగుతుంది కానీ చాలామంది ఎక్ససైజ్ చేయకుండా బరువు తగ్గాలని చూస్తున్నారు అలా చేయడం మంచిదే కానీ ఎక్సర్సైజ్ అనేది మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది అందరూ తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేయడానికి లేదా నడవడానికి లేదా పరిగెత్తడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మన శరీరానికి ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. అందరూ ప్రతి రోజు వ్యాయామం చేయటం ఒక అలవాటుగా పెట్టుకుంటే ఈ బరువు పెరగడం అనే సమస్యలు మనదేశంలో లో ఒక ఉండవు.


మీకు ఎలాంటి సందేహాలు ఉన్న మమ్మల్ని సంప్రదించగలరు లేదా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు. మీకు ఎల్లప్పుడూ మరిన్ని విషయాలు విశేషాలు అందించడానికి మేము కృషి చేస్తాం. మీరు ఇప్పుడు ఏ విధమైన పద్ధతిని పాటిస్తున్నారు మాకు తెలియజేయగలరు.

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.