కంటి కింద నల్లని వలయాలు తగ్గించుకోవడం ఎలా?

Updated: Nov 3, 2019


ప్రస్తుత కాలంలో చాలా మందికి కంటికింద నల్లని వలయాలు వస్తున్నాయి. ఎందుకంటే సెల్ ఫోన్, లాప్టాప్, టీవీ లాంటి ఎన్నో ఉపకరణాలు మనం ఉపయోగిస్తున్న అందువల్ల మన కళ్ళు బాగా ఒత్తిడికి గురవుతున్నాయి. అలాగే చాలా మందికి నిద్ర లేకపోవడం వల్ల మన కళ్ళకు నల్లని వలయాలు వస్తున్నాయి. ఈ వలయాలు తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల పద్ధతులు ఉపయోగిస్తున్నారు. కానీ మనం అత్యంత సులువైన మార్గాలను చూద్దాం


కంటి కింద నల్లని వలయాలు తగ్గించుకోవడం ఎలా?

మొదటి చిట్కా:

కావలిసిన పదార్దాలు: టమాటాలు, నిమ్మకాయలు.

ఉపయోగించు విధానం:

ముందుగా టమాటాలను శుభ్రంగా కడుక్కొని వాటిని గుజ్జుగా చేసి రసం లాగా తీసుకోవాలి. అలాగే నిమ్మకాయను కూడా శుభ్రంగా కడిగి వాటినుండి నిమ్మ రసం తీసుకోవాలి. ఇలా నిమ్మరసం, టమాటో రసం రెండిటినీ కలిపి మిశ్రమంలా చేసుకుని కళ్ళ కింద నల్లని వలయాలు ఉన్న ప్రదేశంలో సున్నితంగా రాసుకోవాలి. పావుగంట అయిన తర్వాత చల్లని నీళ్లు తీసుకొని కడుక్కోవాలి. ఫ్రిడ్జ్ వాటర్ వాడకూడదు. ఇలా వారంలో రెండు నుంచి మూడుసార్లు చేస్తూ ఉంటే నల్లని వలయాలు తగ్గి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

రెండవ చిట్కా:

కావలసిన పదార్థాలు: బంగాళాదుంపలు.

ఉపయోగించు విధానం

బంగాళ దుంపల నుండి రసం తీసి దూదిని ఆ రసంలో ముంచి కళ్ళు మూసుకొని కళ్ళ చుట్టూ రాసుకుంటే పది నిమిషాల తర్వాత చల్లని నీళ్ళతో కడుక్కోవాలి. నల్లని వలయాలు క్రమంగా తగ్గిపోతాయి. ఇలా రోజు విడిచి రోజు చేస్తూ ఉండాలి.

మూడవ చిట్కా:

కావలసిన పదార్థాలు: గ్రీన్ టీ బ్యాగ్స్.

ఉపయోగించు విధానం:

గ్రీన్ టీ బ్యాగ్ ని పది నిమిషాలు ఫ్రిజ్లో ఉంచి తర్వాత దానిని పడుకునే ముందు కళ్ల మీద పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా కళ్ళ మీద పది నిమిషాలు ఉంచుకుని తర్వాత కడిగేసుకోవాలి. కొన్ని రోజులపాటు ఇలా చేస్తే మీరు అనుకున్నట్టుగా నల్లని వలయాలు పోతాయి. మీరు కోరుకునే రంగు మీ సొంతమవుతుంది.


నాలుగవ చిట్కా:

కావలసిన పదార్థాలు: పాలు.

ఉపయోగించు విధానం:

మీరు ప్రతి రోజు బయటికి వెళ్లి వచ్చిన తర్వాత చల్లటి పాలతో కళ్లచుట్టూ రాసుకుంటే మంచిది. ఆరాక చల్లని నీళ్ళతో కడుక్కోవాలి. ఇలా చేస్తే కళ్ళ కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి


ఐదవ చిట్కా:

కావలసిన పదార్థాలు: కమలాపండ్లు, గ్లిజరిన్.

ఉపయోగించు విధానం

ఒక చెంచా కమలా పండ్ల రసాన్ని కొద్దిగా గ్లిజరిన్ ని ఈ రెండింటిని మిశ్రమంలా చేసుకుని కళ్ళు మూసుకొని కంటి చుట్టూ రాసుకుంటే ఈ నల్లని మరకలు పోతాయి. చర్మం మృదువుగా అలాగే కాంతివంతంగా తయారవుతుంది. ఆరిపోయిన తర్వాత చల్లని నీళ్ళతో కడుక్కోవాలి.

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.