ప్రశాంతమైన నిద్ర కోసం ఏమి చేయాలో తెలుసుకోండి?

ప్రస్తుత కాలంలో మనమందరం పరుగు ప్రపంచంలో ఉన్నాం. ప్రశాంతమైన నిద్ర చాలామందికి కరువైపోయింది. చాలామంది డిజిటల్ ప్రపంచానికి అతుక్కుపోయారు. ఎలా అంటే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన కళ్ళు ఏదో ఒక క క డిస్ప్లే ని చూస్తున్నాయి అందుకు కారణం టీవీలు, సెల్ ఫోన్స్, లాప్టాప్స్, కంప్యూటర్స్ ఇలా అన్ని రంగాల్లోనూ డిజిటల్ డిస్ప్లే ను వాడుతున్నారు. వీటి వల్ల చాలామందికి నిద్ర కరువైంది. నిద్ర రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి ఒక చక్కని పరిష్కారం మీ ముందుకు తీసుకు వచ్చాము.

ప్రశాంతమైన నిద్ర కోసం ఏమి చేయాలో తెలుసుకోండి?

పరిష్కార మార్గం:

కావలసిన పదార్థాలు:

ఒక కప్పు పాలు, నాలుగైదు ఖర్జూరాలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన మూడు లేదా నాలుగు బాదాం పప్పు గింజలు, ౩-4 పచ్చి కొబ్బరి ముక్కలు, అర టీ స్పూన్ కుంకుమపువ్వు, రెండు టీస్పూన్ల నెయ్యి, చిటికెడు యాలకుల పొడి.


తయారుచేయు విధానం:

రెండు టీస్పూన్ల నెయ్యి ఒక పాత్రలో తీసుకొని పైన చెప్పిన పదార్థాలన్నింటిని దానిలో వేసి చిన్న సెగమీద పాలను మరిగించాలి. దానికి కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రిపూట తాగితే నిద్ర సంబంధమైన వ్యాధులు తగ్గి మనకు హాయిగా నిద్ర పడుతుంది.


ఇలాంటి మరిన్ని విషయాలు, విశేషాలు, పరిష్కార మార్గాలు తెలుసుకోవాలని ఉంటే మా వెబ్సైట్లో దర్శించండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలని కింద తెలియజేయగలరు. ధన్యవాదాలు!

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.