దగ్గు వెంటనే తగ్గాలంటే ఏమి చేయాలి?

ప్రస్తుత వాతావరణం లో మనమందరం కలిసి వాతావరణంలో జీవిస్తున్నాం. కాబట్టి మనం శ్వాస పీల్చడం లో ఈ కాలుష్య వాతావరణంలో ఉండే గాలి పీల్చడం వలన మన శరీరంలోకి అంటే ఊపిరితిత్తుల్లోకి అశుభ్రమైన కాలుష్యం అయినా గాలి అని పిలుస్తున్నాం. అంటే ఊపిరితిత్తుల్లో ఈ కాలుష్యం అయిన గాలి ద్వారా మలిన పదార్థాలు అనేకం వస్తాయి. తద్వారా ఈ మలిన పదార్థాలను బయటకు పంపించడానికి మన శరీరం చేసే పనినే దగ్గు అంటాము. మన ఊపిరితిత్తుల్లోకి స్వచ్ఛమైన గాలిని పీల్చాలి.


దగ్గు వెంటనే తగ్గాలంటే ఏమి చేయాలి?

కాని మనం పీల్చే గాలిలో ఘాటైన వాసన, పోగా, ధూళి, దుమ్ము మరియు సూక్ష్మజీవులు మన శరీరంలోని ఊపిరితిత్తులకు చేరటం వల్ల మనకు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ను తొలగించడానికి దగ్గు అనేది మొదలు అవుతుంది. ఈ విధమైన ఇన్ఫెక్షన్ ద్వారా దగ్గు నుంచి గాలి అనేది బయటకు వేగంగా వస్తుంది. దాని నుంచి ఊపిరితిత్తుల్లో ఉన్న బ్యాక్టీరియా వైరస్ ఇలా ఇన్ఫెక్షన్ కు కారణమైన సూక్ష్మజీవులు బయటకు వస్తాయి. దగ్గు నుండి ఉపశమనం పొందడానికి మనకు అనేక మార్గాలు ఉన్నాయి. అందులో కొన్ని మనం ఎప్పుడు తెలుసుకుందాం.


పరిష్కార మార్గాలు:

వేడి నీటిలో గాని వేడి పాలలో గాని మిరియాలపొడి వేసుకుని తాగడం అనేది చేస్తే దగ్గు అనేది క్రమంగా తగ్గుతుంది.


రోజు ఉదయాన్నే పరగడుపున వేడినీటిని తాగడం వల్ల మన శరీరంలో ఉన్న కఫం తెగి దగ్గు అనేది తగ్గిపోతుంది. దగ్గు బాగా ఉన్నవాడు ఇది చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది.


అలాగే దగ్గు బాగా ఉన్న వాళ్ళు రోజు ఉదయాన్నే ఎటువంటి పేస్టు వాడకుండా వేపపుల్లను వాడటం వల్ల శరీరంలో ఉన్న మొత్తం బయటకు వచ్చి దగ్గు తగ్గడానికి సహాయపడుతుంది.


రోజు ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్ళలో నాలుగు స్పూన్ల తేనెను కలుపుకొని అలాగే ఒకటి లేదా రెండు స్కూల్లో నిమ్మరసాన్ని కలిపి తాగడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

కొంతమందికి దగ్గు ఎక్కువగా ఉండడం వల్ల ఛాతి భాగంలో నొప్పి అనేది వస్తుంది ఇలాంటి వారు నీటిని వేడి చేసుకుని ఆ నీటితో ఛాతీ మొత్తం కాపడం పెట్టుకోవడం వల్ల దగ్గు నుండి ఒక సమయం పొంది ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉంటుంది.


రోజు నిమ్మరసం తాగడం వల్ల కూడా మనకు దగ్గు నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.


ఒకటి లేదా రెండు తులసి ఆకులను వేసుకుని టీ లాగాకరుచుకుని మనం రోజూ తీసుకోవడం వల్ల దగ్గు అనేది తగ్గుతుంది.


పొడి దగ్గు ఎక్కువగా ఉన్నవారు అల్లం ముక్కను తీసుకోవడం గాని అనగా అల్లం ముక్క నమిలి ఆ రసాన్ని పీల్చడం ద్వారా లేదా అల్లం ఒక నీటిలో వేసుకుని మరిగించి దానిని తాగడం లాగా చేయడంవల్ల దగ్గు అనేది తగ్గుతుంది.


సాధారణ దగ్గు ఉన్నవారు రాత్రిపూట పటిక బెల్లం తినడం వల్ల గాని లేదా రోజు తేనెని తీసుకోవడం వల్ల గాని ఈ దగ్గు అనేది తగ్గుతుంది.


వేడినీటిలో పసుపు వేసుకొని ఆవిరి పట్టడం వల్ల శరీరంలో ఉన్న కఫం బయటకు వస్తుంది.


అలాగే రాత్రిపూట గోరువెచ్చని పాలలో పసుపు వేసుకొని తాగడం వల్ల అనేది బయటకు వస్తుంది.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

దగ్గు ఉన్నవారు దాదాపు స్వీట్స్ అంటే మిఠాయి వంటి తీపి పదార్థాలు తీసుకోకుండా ఉండటం మంచిది అలాగే చాక్లెట్స్ కూడా తీసుకోకూడదు.


కొంతమందికి మందు తాగడం అనేది దినచర్యలో ఇది ఒక భాగంగా ఉంటుంది అలాంటి వారు మందు అనేది తీసుకోకుండా ఉండాలి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది దీనివల్ల దగ్గు అనేది తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది.


ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా వెబ్సైట్ను సందర్శించండి అలాగే మీయొక్క సందేహాలు సలహాలు తెలియజేయాలంటే కింద కామెంట్ బాక్స్ లో వివరించండి.

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.