గొంతు నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి?

సాధారణంగా గొంతు నొప్పి అనేది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ గొంతు నొప్పి అనేది సర్వసాధారణమైన విషయం. అందరికీ మీ గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో తగ్గించుకోవడానికి చాలా సులభమైన మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే చాలామంది ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్ మందులకు అలవాటు పడటం వల్ల ప్రతి చిన్నదానికి మందులు వాడటం అలవాటు చేసుకున్నారు. ఈ బిజీ లైఫ్ లో ఇంగ్లీష్ బాగా అలవాటు పడిపోయారు. కారణం క్షణం తీరిక లేకపోవడం. కానీ వీటివల్ల మన జీవితంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉన్నది. కానీ సహజసిద్ధమైన పద్ధతులు వాడటం వల్ల మనకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా మనకున్న వ్యాధులను తప్పించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.


గొంతు నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి?

అసలు విషయానికి వస్తే ఈ గొంతు నొప్పి వల్ల మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు మనకు తీవ్రమైన నొప్పి కలుగుతుంది. అలాగే ఈ గొంతు నొప్పి అనేది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు కొన్ని పద్ధతులు తెలుసుకుందాం. అవి ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు.

మొదటి చిట్కా:

కావలసిన పదార్థాలు: వేడి నీళ్లు, ఉప్పు.

తయారుచేయు విధానం: వేడినీళ్లలో కాస్తంత ఉప్పు వేసుకొని దీన్ని తయారు చేసుకోవచ్చు.

ఉపయోగించు విధానం: ఈ నీళ్లను నోటిలోకి తీసుకుని పుక్కిలించి వేయటం వల్ల గొంతు నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. రోజుకు రెండు లేదా మూడుసార్లు ఇలా నోటితో పుక్కిలించి వేయాలి.


రెండవ చిట్కా:

కావలసిన పదార్థాలు: వేడి నీళ్లు, అల్లం.

తయారుచేయు విధానం: వేడినీళ్లలో అల్లం వేసి బాగా మరగనిచ్చి, వడకట్టుకుంటే అల్లం టీ తయారవుతుంది.

ఉపయోగించు విధానం: ఇలా అన్నం తిని ప్రతి రోజూ తాగటం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం ఉంది. అలాగే మనం అల్లం ముక్కను బుగ్గన పెట్టుకొని దాని రసాన్ని పెంచడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.


మూడవ చిట్కా:

కావలసిన పదార్థాలు: వేడి నీళ్లు, పసుపు, నిమ్మరసం.

తయారుచేయు విధానం: నీళ్లను బాగా మరిగించి దానిలో పసుపు వేసి వచ్చిన దానిని వడగట్టుకుని ఒక గ్లాసు తీసుకుని దానిలో కొద్దిగా నిమ్మరసం పిండుకుని తాగాలి

ఉపయోగించు విధానం: ఈ నేలను గోరువెచ్చగా అయిన తర్వాత రోజుకు మూడు పూటలా తాగడం వల్ల మనకు మంచి ఫలితం కనిపిస్తుంది. ఎందుకంటే పసుపు అనేది ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో మొదటి స్థానంలో ఉంటుంది.


నాలుగవ చిట్కా:

కావలసిన పదార్థాలు: జీలకర్ర, వెల్లుల్లి.

తయారుచేయు విధానం: నీటిని బాగా మరిగించి ఆ నీటిలో జీలకర్రను, వెల్లుల్లి వేసి ఇ మరిగించాలి. ఇలా చేయడం వల్ల జీలకర్ర, వెల్లుల్లి ఉంటే గుణాలు నీటిలోకి దిగుతాయి. ఈ నీటిని మనం వడకట్టుకోవాలి.

ఉపయోగించు విధానం: ఇలా మరిగించిన నీటిని గోరువెచ్చగా అయ్యేవరకూ నుంచి తర్వాత ఈ నీటిని తాగడం వల్ల మనకు గొంతునొప్పి నుండి వచ్చు వెల్లుల్లి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడటానికి సహాయపడుతుంది ఇలా రోజుకు మూడు పూటలా చేయడం వల్ల త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది.


మరిన్ని చిట్కాలు:

రోజూ గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.


మనకి తులసి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. తులసి ఆకును నమలడం వల్ల అలా వచ్చే రసాన్ని మింగుతూ ఉంటే గొంతునొప్పి నుండి లభిస్తుంది.


ఇంట్లో ఉండే లవంగాన్ని బుగ్గన పెట్టుకొని కొద్దికొద్దిగా నమలడం వల్ల వచ్చే రసాన్ని మింగితే త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది.


ఇలా మరిన్ని విషయాలు, విశేషాలు, సలహాలు, సూచనలు తెలుసుకోవాలంటే మా వెబ్ సైట్ ని తరచు దర్శిస్తూ ఉండండి మీకు మరిన్ని సులభమైన మార్గాలు సూచించడానికి ఎల్లప్పుడూ మీ ముందు ఉంటాం.

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.