చిటికెలో తెల్ల జుట్టుని నల్లగా మార్చండి

ప్రస్తుత కాలంలో చిన్నా, పెద్దా, ఆడ, మగా అనే తేడా లేకుండా అందరికీ తెల్లజుట్టు వస్తుంది. అంటే పోషకాహార లోపం వల్ల ఇది జరుగుతుంది. కనుక చాలా మంది ఈ సమస్యతో హెయిర్ కు డ్రై కలర్ వాడుతున్నారు. దీనికి ఒక చక్కని పరిష్కారంతో మీ ముందుకు వచ్చాను.


చిటికెలో తెల్ల జుట్టుని నల్లగా మార్చండి

పరిష్కార మార్గం:

కావలసిన పదార్థాలు:

గాయ పాకు రసం 100 గ్రాములు, గుంటగలగరాకు రసం 100 గ్రాములు, స్వచ్ఛమైన నల్ల నువ్వుల నూనె 200 గ్రాములు.


తయారుచేయు విధానం:

గాయ పాకు రసం 100 గ్రాములు, గుంటగలగరాకు రసం 100 గ్రాములు, స్వచ్ఛమైన నల్ల నువ్వుల నూనె 200 గ్రాములు ఈ మూడింటిని ఒక చిన్న పాత్రలో తీసుకొని ఆ పాత్రను పొయ్యి మీద ఉంచి చిన్న మంట పెట్టాలి. అలా సన్నని సెగ మీద నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. తర్వాత ఆ నూనెను చల్లార్చి వడగట్టుకుని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ తైలం చాలా చక్కగా నల్లగా ఉంటుంది. ప్రతిరోజు ఈ నూనెను గోరువెచ్చగా చేసుకొని మనం పడుకునే ముందు చక్కగా వెంట్రుకల యొక్క కుదుళ్లకు పట్టేలా సున్నితంగా మర్దన చేయాలి.


ఇలా క్రమం తప్పకుండా రోజు వాడుతూ ఉంటే కొన్నాళ్ళకు తల వెంట్రుకలు నల్లగా మారిపోతాయి. చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవరైనా ఇది వాడవచ్చు. మీకు మరిన్ని విశేషాలు, పరిష్కారాలు కావాలంటే మా వెబ్సైట్ ని సందర్శించండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. వాడిన తర్వాత ఫలితాన్ని చెప్పగలరు.

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.