మిరియాల వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు!

Updated: Nov 3, 2019

మనం రోజూ తీసుకునే ఆహారంలో వివిధ రకాలైన పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. అవి మన ఆరోగ్యాన్ని పెంచడానికి ఎంతో దోహదపడతాయి. అందులో ఒకటైన మిరియాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మిరియాలు వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు!

మిరియాలు చాలా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చిట్టి మిరియాలు ఐరన్, మంగానీసు, పొటాషియం, క్యాల్షియం, విటమిన్ సి ఎక్కువ పాళ్ళలో ఉంటాయి. అదేవిధంగా అమినో యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి. మిరియాలు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని దూరం చేయడంలో ఎంతగానో పనిచేస్తాయి. జలుబు, దగ్గు తగ్గించుకోవడానికి మిరియాల ద్వారా ఒక దివ్య ఔషధాన్ని తయారు చేసుకుందాం.


పరిష్కార మార్గం

కావలసిన పదార్థాలు:

ఒక గ్రాము మిరియాలు, ఐదు లవంగం, పావు చెంచా వెల్లుల్లి.


ఉపయోగించు విధానం:

ఈ మూడింటినీ కలిపి గ్లాసు నీటిలో మరిగించాలి. అలా మరిగించిన నీటిని వడగట్టుకుని తేనెతో కలుపుకొని రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి. దీంతో దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలు దూరంగా వెళ్లిపోతాయి.


పొట్టలో గ్యాస్ ఏర్పడినప్పుడు ఒక కప్పు మజ్జిగలో పావు చెంచా మిరియాలపొడి కలిపి తీసుకుంటే తక్షణ ఉపశమనం కలుగుతుంది. అలాగే పసుపు మిరియాల పొడి మిశ్రమాన్ని చిటికెడు చొప్పున నీటిలో మరిగించి రాత్రుల్లో తాగితే తుమ్ములు, జలుబు తగ్గుతాయి.


మీకు మరిన్ని విశేషాలు, పరిష్కార మార్గాలు, సలహాలు, సూచనలను ఇలాంటివి కావాలి అనుకున్న మీరు మా వెబ్ సైట్ ని సందర్శించండి. అలాగే మీయొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.