వజ్రాసనం ఎందుకు వేయాలి?

Updated: Nov 3, 2019

భోజనం చేసిన వెంటనే ఆచరించే ఏకైక అసలు ఆసనం ఏది? మనం భోజనం చేసిన వెంటనే ఆసనాలు ఆచరించటం చేయము. కానీ భోజనం తర్వాత వేయగల ఏకైక ఆసనం ఇది. నాకు తెలిసి చాలా మందికి ఈ ఆసనం గురించి తెలియకపోవచ్చు.


వజ్రాసనం ఎందుకు వేయాలి?

వజ్రాసనం

వజ్రాసనం అంటే సంస్కృత భాషలో పిడుగు లేదా వజ్రం అని అర్థం వస్తుంది. ఈ ఆసనాన్ని ఎలా ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


వజ్రాసనం ఆచరించు విధానం:

ముందుగా మీ కాళ్ళను ముందుకు చాపుకొని కూర్చోవాలి. కుడికాలును మోకాళ్ళ వరకు మడిచి దాని యొక్క కుడి పిరుదు కిందకు వచ్చేలాగా కూర్చోవాలి. అలాగే ఎడమకాలిని మడిచి ఎడమ పిరుదు కింద వచ్చేలాగా కూర్చోవాలి. కాళ్ళ బొటనవేళ్ళు ఒకదానితో ఒకటి తాకుతూ ఉండేలా చూసుకోవాలి. అలాగే వెన్నుముక నిటారుగా ఉండేలాగా కూర్చోవాలి. ఎడమ అరచేతిని ఎడమ మోకాలిపై ఉంచి, అలాగే కుడి అరచేతిని కుడి మోకాలిపై ఉంచి కూర్చోవాలి. ఇలా ఈ భంగిమలో ఐదు నిమిషాల వరకు కూర్చోవాలి. ఇలా మనం 30 నిమిషాల వరకు కూర్చోవచ్చు. ఇలా కూర్చున్న తర్వాత గట్టిగా గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఈ విధంగా రోజూ చేస్తూ ఉండాలి.


మొదటిరోజు ఐదు నిమిషాలు తో ప్రారంభించి ఆ సమయాన్ని పెంచుకుంటూ వెళుతూ 30 నిమిషాల వరకు చెయ్యవచ్చు. ఇలా చేయడం వల్ల మనకు కు చాలా ఉపయోగాలు ఉన్నాయి.


ఉపయోగాలు

  • ఈ ఆసనం వేయడం వల్ల తొడలు, కాళ్లు, పిక్కలు మొదలైనటువంటి ప్రాంతాలలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీనివల్ల అక్కడ ఉన్న అదనపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది. అలాగే నొప్పులు గాని ఏమైనా ఉంటే తగ్గుతాయి.

  • మనకు వెన్నునొప్పి ఉంటే అది తగ్గుతూ వస్తుంది.

  • అలాగే పొట్ట సమస్యలు, అజీర్తి, మలబద్ధకం తగ్గుతాయి.

  • అలాగే ఊబకాయం కూడా తగ్గుతుంది.

  • శరీరమంతా రక్త ప్రసరణ చాలా చక్కగా జరుగుతుంది.

  • ఏకాగ్రత, జ్ఞాపకశక్తి ఎంతగానో పెరుగుతాయి.

  • మీకు మరిన్ని విషయాలు కావాలంటే మా వెబ్సైట్ దర్శిస్తూ ఉండండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయగలరు. ధన్యవాదాలు.

0 views

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.